జగిత్యాల చేపల మార్కెట్కు మాంసం ప్రియులు పోటెత్తారు. ఆదివారం కావడం వల్ల పెద్దసంఖ్యలో చేపలు, మాసం దుకాణాల వద్ద క్యూకట్టారు. ఉదయం పదిగంటలకు లాక్డౌన్ నిబంధనలు అమల్లోకి వస్తున్నందున తెల్లవారుజామునుంచే మార్కెట్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
ఓ పక్క కొవిడ్ భయం.. మరోపక్క లాక్డౌన్ నిబంధనలు… ఉన్న నాలుగ్గంటల్లోనే అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఉదయం నుంచే చేపలు, మాంసం దుకాణాల వద్ద లైన్లలో నిలుచుని కొనుగోలు చేశారు.
ఇదీ చూడండి: సైబరాబాద్లో కఠినంగా లాక్డౌన్ అమలు : సీపీ సజ్జనార్