జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఎల్ఎమ్ కొప్పుల ట్రస్ట్ చేయుతనందించింది. తల్లిదండ్రులు లేని అన్నా, చెల్లెల్లకి 125 గజాల స్థలంలో రూ. 3.50 లక్షల ఖర్చుతో ఇంటిని నిర్మించి ఇచ్చి దాతృత్వాన్ని చాటుకుంది.
పరిస్థితి గుర్తించి..
తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శిరీష, శ్రీకాంత్ తల్లిదండ్రులు చిన్నప్పుడు అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి వృద్ధాప్యంలో ఉన్న మేనత్త దగ్గర ఇద్దరు నివసిస్తున్నారు. గ్రామస్థులు వీరి పరిస్థితిని ట్రస్ట్ ఛైర్ పర్సన్ స్నేహలత దృష్టికి తెలుకెళ్లారు. పరిస్థితిని గుర్తించిన స్నేహాలత.. వారికి ఇంటిని నిర్మించి ఇచ్చారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దగ్గరుండి గృహ ప్రవేశం చేయించారు. వారికంటూ ఓ ఇల్లు నిర్మించి ఇచ్చిన ట్రస్ట్‌కి, మంత్రికి అన్నా, చెల్లెల్లు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: అభిమాని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో సోనూసూద్ సందడి