జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో టెండర్ ఓటు నమోదైంది. 13వ పోలింగ్ బూతులో వెల్లుల లక్ష్మి అనే మహిళ ఓటును గుర్తు తెలియని వారు వేసి వెళ్లారు. అసలు ఓటరు ఓటు వేసేందుకు రాగా.. అసలు విషయం బయటపడింది. ఫలితంగా అభ్యర్థులు పోలింగ్ కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు.
చివరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అసలు ఓటరు వెల్లుల లక్ష్మితో టెండర్ ఓటు వేయించేందుకు అధికారులు సిద్ధం కాగా.. కొందరు అభ్యర్థులు దీనికి అభ్యంతరం తెలిపారు. ఫలితంగా పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇదీ చూడండి: భవననిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతివ్వాలి: కేటీఆర్