పెళ్లి ఓ మధురైన ఘట్టం. జీలకర్ర బెల్లం, మాంగళ్యాధారణ, ముత్యాల తలంబ్రాలు, ఏడడుగులు, అరుంధతి నక్షత్రం... ఇలా ప్రతి సన్నివేశంలో ఓ అర్థం దాగి ఉంటుంది. అయితే వధువుకు వరుడు అరుంధతి నక్షత్రాన్ని చూపించడం... ఓ ప్రత్యేకత. సప్తరుషుల్లో ఒకరైన వశిష్టుడు, అరుంధతి దంపతులది అన్యోన్యమైన దాంపత్యం. వారి జీవితం చాలా సంతోషంగా సాగింది. అందుకే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు.
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కల్వకోటలో జరిగిన పెళ్లిలో దీనికి ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లికొడుకు రాయకల్‌కు చెందిన అభయ్‌రాజ్ భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు. కల్యాణ వేదిక మీద టెలిస్కోప్ ఏర్పాటు చేసి... వధువుకు అరుంధతి నక్షత్రాన్ని చూపించడం అందరిని ఆకర్షించింది.
ఇదీ చూడండి: హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్