అమెరికాలో 23 నిమిషాల్లో 108 సూర్యనమస్కారాలు చేసి ఓ తెలంగాణ యువకుడు అబ్బురపరిచాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్లకు చెందిన మరిపల్లి ప్రవీణ్... అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం మాడిసన్ నగరంలో ఘనీభవించిన సరసుపై 108 సూర్య నమస్కారాలు చేసి ఆకట్టుకున్నాడు. మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలో 23 నిమిషాల్లో 108 సూర్యనమస్కారాలు పూర్తి చేశారు. నాలుగేళ్లుగా సుమారు 11 పర్వతాలను అలవోకగా అధిరోహించిన ప్రవీణ్‌ను ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తారు.
వడోదరలో యోగా శిక్షకుడిగా పనిచేసిన ఆయన... ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్‌లోని మనీమహేశ్ కైలాస్, నేపాల్‌లోని ఎవరెస్ట్ బెస్ట్ క్యాంప్, మేరా పర్వతం, ఫ్రాన్స్లో మౌంట్ బ్లా, జర్మనీలో గ్రూప్ టెన్, ఆస్ట్రేలియాలో అగైన్ స్టెయిన్ , జోర్గ్ స్రోపెన్ పర్వతాలు అధిరోహించారు. అమెరికాలో నార్త్ కరోలినా ప్రాంతంలోని మౌంట్ సోమ శిఖరాన్ని అధిరోహించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మాస్టర్ ఫైన్ ఆర్ట్స్ 4డీ చదువుతున్నారు.