జగిత్యాల జిల్లాలో భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఈరోజు 47 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతవరణ వర్గాలు తెలిపాయి. గత నాలుగు రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల ఉదయం 11 గంటలకే రోడ్లు బోసి పోతున్నాయి. జనం రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. ఎండ వేడిని తట్టుకునేందుకు ప్రజలు శీతల పానియాలను ఆశ్రయిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు వేడిని తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ప్రయాణాలు చేసే వారు ఉదయం, సాయంత్రం వేళలనే ఎంచుకుంటున్నారు. మునుపెన్నడూ ఇంత భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు చూడలేదని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి : నేనా.. పార్టీ మారతానా? అంతా ఉత్తముచ్చటే!