జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీగా జె.సురేశ్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న అదనపు ఎస్పీ దక్షిణామూర్తి అనారోగ్యంతో ఈ మధ్యనే మృతిచెందగా ఆయన స్థానంలో సురేశ్‌కుమార్ విధుల్లో చేరారు. గ్రూప్-1 క్యాడర్‌కు సురేశ్ గతంలో ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పని చేశారు.
హైదరాబాద్ నుంచి..
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి జగిత్యాలకు బదిలీపై వచ్చారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు జిల్లా ఇంఛార్జీ ఎస్పీ, కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి, జగిత్యాల జిల్లా కలెక్టర్ రవిని కలిశారు. జిల్లాలో నేరాల పరిస్థితిని అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో శాంతి భద్రతల కోసం కృషి చేస్తానని ప్రజలకు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : డిప్యూటీ తహసీల్దార్ పదోన్నతులపై సర్కార్ కసరత్తు