ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహిళను తెరాస నాయకులు భయభ్రాంతులకు గురిచేసి నామపత్రాన్ని ఉపసంహరించుకునేలా చేశారని కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండల పరిషత్ కార్యాలయం ముందు దర్నా నిర్వహించారు. ఆరెపల్లి గ్రామానికి చెందిన సాయిని కవితను తెరాస వేధింపులకు గురిచేస్తోందని జిల్లా డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ లక్ష్మీబాబు ఎన్నికల కోడ్ ఉన్నందున ధర్నా విరమించుకోవాలని సూచించారు. అయినా ఆందోళన కొనసాగించడం వల్ల పోలీసులు లక్ష్మణ్ కుమార్‌తోపాటు పార్టీ శ్రేణులను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.
ఇవీ చూడండి : కరీంనగర్లో భాజపా ఆందోళన