శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శ్రీ మురళీ కృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో మురళీకృష్ణుడిని అభిషేకించారు.
కరోనా కారణంగా భక్తులను అధిక సంఖ్యలో ఆలయం లోపలికి అనుమతించలేదు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ వచ్చిన కొందరు భక్తులను మాత్రమే లోపలికి అనుమతించారు. శ్రీ కృష్ణ భగవానుడి భజనలతో ఆలయం మారుమోగిపోయింది. భక్తులందరూ భజనలు, కీర్తనలు చేస్తూ... భక్తి భావంలో మునిగిపోయారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా కేసులు నమోదు