జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన చికిత్స చేసి వైద్యులు విజయం సాధించారు. జగిత్యాల వాణినగర్కి చెందిన శివ అనే రెండేళ్ల బాలుడికి ఊపిరితిత్తుల్లో చీము రావడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు శస్త్రచికిత్స చేశారు. సాధారణంగా ఇలాంటి ఆపరేషన్ ఛాతి వైద్యశాలలో మాత్రమే చేస్తారు. ప్రైవేట్ ఖర్చులు భరించలేని పేద కుటుంబం కావడం వల్ల సర్కార్ వైద్యులు ఇక్కడే ఆపరేషన్ చేసి ఘనత సాధించి నిండు ప్రాణాన్ని నిలిపారు. ఆపరేషన్ విజయవంతం కావటంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే చికిత్స ప్రైవేట్ ఆసుపత్రిలో చేయాలంటే 3 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు.
ఇవీ చూడండి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య సంఘం