గణేశ్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూశర్మ మండప నిర్వాహకులను కోరారు. జగిత్యాల వీకేబీ ఫంక్షన్ హాల్‌లో మండప నిర్వాహకులు, గణేశ్ ఉత్సవ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేశారు. డీజేలను వాడరాదని, ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే మైక్‌లను వాడాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అందరూ కలిసి మెలసి ఉత్సవాలను నిర్వహించుకోవాలన్నారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల కోసం పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
ఇవీచూడండి: "సింధు, మానసి" తెలంగాణ కీర్తి కిరీటాలు