దక్షిణ మధ్య రైల్వే అధికారులు జగిత్యాల జిల్లా మెట్పల్లి రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. రానున్న రోజుల్లో రైల్వే స్టేషన్ రవాణా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పరిశీలన జరిపారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో మెట్పల్లి చేరుకుని పలువురు ప్రముఖులు, అధికారులు సమావేశమయ్యారు.
ఈ ప్రాంతంలో ఎలాంటి పంటలు పండిస్తారు.. ఎంత దిగుబడి వస్తుంది.. అనే అంశాలను వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. కోల్‌కతా, బంగ్లాదేశ్, ఒడిశా, బీహార్ తదితర ప్రాంతాలకు సరుకులను తరలిస్తామని ఇక్కడ రవాణా పాయింట్‌ని ఏర్పాటు చేస్తే రైతులకు మంచి లాభసాటిగా ఉంటుందని వ్యాపారులు తెలిపారు. దీనిపై విచారించి త్వరలో ఒక నిర్ణయాన్ని తీసుకొని వివరిస్తామని అధికారుల వ్యాపారులకు తెలిపారు.
ఇదీ చూడండి : ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం