జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. మందులకు డబ్బులు అడిగినందుకు కన్న తండ్రిని గొడ్డలితో కిరాతకంగా హత్య చేశాడు ఓ కసాయి కొడుకు. మంద మల్లేశం అనే వ్యక్తి జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లి ఈ మధ్యనే వచ్చాడు. అతని తండ్రి చంద్రయ్య పేరు మీద ఉన్న రెండెకరాల 10 గుంటల వ్యవసాయ భూమి తన పేరున చేయాలని ఒత్తిడి తెస్తున్నాడు. ఈ వివాదంతో కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయి. మల్లేశం భూమి సాగు చేసుకుంటుండగా.. కనీసం మందుల కోసమైనా డబ్బులు ఇవ్వాలని తండ్రి కోరాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన కొడుకు మద్యం మత్తులో చంద్రయ్యను నరికాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'నాణ్యమైన విద్య వల్లే... బంగారు తెలంగాణ సాధ్యం'