జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి స్మితాసబర్వాల్ పర్యటించారు. ఇందులో భాగంగానే అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మంకీ ఫుడ్ కార్డు కోర్టును పరిశీలించారు. ఎనిమిది ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్కుతో పాటు అందులో నాటిన వివిధ రకాల మొక్కలను స్మితా సబర్వాల్ పరిశీలించారు. అనంతరం గ్రామ సభలో పాల్గొని 30 రోజుల ప్రణాళిక కార్యాచరణ గురించి చర్చించారు. ఈ కార్యక్రమంతో గ్రామాలన్నీ సుందరంగా తయారవుతున్నాయని తెలిపారు.
ఇవీ చూడండి: కాసేపట్లో మంత్రివర్గ సమావేశం... కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం