Six Women suffers infection in Jagtial: ఓ వైపు మాతాశిశు సంరక్షణ కోసం ప్రభుత్వం పెద్ద పీటవేస్తుంటే.. వైద్యుల నిర్లక్ష్యం వల్ల పలుచోట్ల మహిళల ప్రాణాలకు ముప్పు కలుగుతోంది. తాజాగా జగిత్యాల జిల్లా మాతా శిశు సంరక్షణ ఆస్పత్రిలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. సిజేరియన్ తర్వాత ఆరుగురు బాలింతలకు ఇన్ఫెక్షన్ సోకి కుట్లు ఊడిపోతున్నాయి.
కుట్లు ఊడిపోయి బాధపడుతున్న ఆరుగురు బాలింతల్లో ఇద్దరికి కుట్లు వేయగా.. మరో నలుగురికి కుట్లు వేయాల్సి ఉంది. ఇన్ఫెక్షన్ వల్లే కుట్లు ఊడిపోతున్నాయని డాక్టర్లు చెబుతున్నారని బాలింతలు తెలిపారు. ఇన్ఫెక్షన్ వచ్చిన దగ్గర చీము పూర్తిగా పట్టేసిందని ఆందోళన చెందారు. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదని వాపోయారు. వైద్యులు, సిబ్బంది సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని బాలింతలు వాపోయారు.
ఇవీ చదవండి: