జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వామివారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాలుగవ రోజు ఉగ్ర, యోగ నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకొని సహస్ర కలశార్చన చేసి నరసింహ హోమాన్ని నిర్వహించారు. ఉత్తర తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవీ చూడండి: పెళ్లి మండపమా..? మోదీ ఎగ్జిబిషనా..??