జగిత్యాల పట్టణంలో హజారీ ప్రాంతంలో ఓ ప్రైవేట్ పాఠశాల వాహనానికి పెద్ద ప్రమాదం తప్పింది. బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి విద్యార్థులను తీసుకెళుతుండగా అదుపు తప్పి ఓ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టి... డ్రైనేజీ కాలువలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులున్నారు. స్థానికులు గమనించి విద్యార్థులను బయటకు తీశారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో వాహనాన్ని బయటకు తీశారు. ప్రమాదం తప్పి విద్యార్థులు సురక్షితంగా ఉన్నందుకు అంతా ఊపిరి పీల్చకున్నారు.
ఇవీ చూడండి: ఆర్టీసీపై సీఎం సుదీర్ఘ సమీక్ష- కీలక అంశాలపై లోతైన చర్చ