సకల సౌభాగ్యాలు కలగాలని కోరుతూ... జగిత్యాల పట్టణంలో సంక్రాంతి నోములు ఘనంగా జరిగాయి. టవర్ సర్కిల్, బీట్ బజార్లో జరిగిన నోముల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని.. గౌరీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరిన కోరికలు నెరవేర్చు తల్లి అంటూ ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
ఇవీ చూడండి: సంక్రాంతి ప్రత్యేక ఏంటీ.. అసలెందుకు జరుపుకోవాలి?