ఆర్టీసీ బస్సు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన సదస్సులను నిర్వహించనున్నట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్‌ఎం జీవన్ ప్రసాద్ తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రయాణ ప్రాంగణంలో ఉన్న దుకాణాలతో పాటు హోటళ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలిచ్చారు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభం అయిన దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసి విద్యార్థుల చదువులకు భరోసాను అందిస్తున్నామన్నారు.
ఇవీ చూడండి: మొన్న ఎంపీ.. నిన్న పెళ్లి... నేడు ప్రమాణం