ETV Bharat / state

ఆదాయ మార్గాలపై దృష్టిసారించిన ఆర్టీసీ - telangana varthalu

ఆర్టీసీ సంస్థ ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇప్పటికే కార్గో సేవల ద్వారా సరుకు రవాణా చేస్తూ ఆదాయం సమకూర్చుకుంటూనే.. మరోవైపు నిరుద్యోగ యువకులకు డ్రైవర్లుగా శిక్షణ ఇస్తోంది. జగిత్యాల డిపోలో అధికారులు శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న ఒక బ్యాచ్‌కి ధ్రువపత్రాలు సైతం అందించారు.

ఆదాయ మార్గాలపై దృష్టిసారించిన ఆర్టీసీ
ఆదాయ మార్గాలపై దృష్టిసారించిన ఆర్టీసీ
author img

By

Published : Feb 25, 2021, 9:09 PM IST

ఆదాయ మార్గాలపై దృష్టిసారించిన ఆర్టీసీ

ఆర్టీసీ సంస్థ వివిధ మార్గాల ద్వారా ఆదాయం ఆర్జించేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్టీసీ ద్వారా నిరుద్యోగ యువతకు డ్రైవర్లుగా శిక్షణ ఇస్తోంది. ఇందులో భాగంగా జగిత్యాల డిపోలో తొలిసారిగా శిక్షణ తరగతులను ఏర్పాటు చేసింది. గతేడాది డిసెంబర్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తరగతులను ప్రారంభించారు. తొలిబ్యాచ్‌లో 9 మందికి శిక్షణ ఇచ్చి.. సర్టిఫికెట్లు అందించారు.

శిక్షణ పొందాలంటే..

ఈ శిక్షణ పొందాలంటే 15,600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెండో బ్యాచ్‌కు శిక్షణ ఇస్తున్నామని... చివరి దశకు చేరిందని జగిత్యాల డిపో మేనేజర్​ వెల్లడించారు. ఇందులో 16 మంది ఉండగా.. వారికి థియరీ, ప్రాక్టికల్‌ రూపంలో తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓ ప్రత్యేక బస్సును కేటాయించి శిక్షకుడు, సహాయ ఇంజినీర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీలకు ఉచితం

ఎస్సీ, ఎస్టీలకు కార్పొరేషన్‌ ద్వారా ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. మరికొందరు డబ్బులు తీసుకుని నేర్పిస్తున్నారు. ఇది ఎంతో ఉపయోగకరంగా ఉందని యువకులు తెలిపారు. ఇప్పటికే మూడో బ్యాచ్‌కి సైతం యువకులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: రెండోరోజూ విద్యార్థుల హాజరు అంతంత మాత్రమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.