హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను తొలగించిన వారికి.. గ్రామపంచాయతీ అధికారి జరిమాన విధించిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. హబ్సీపూర్లో నాటిన మొక్కలను మేకలు తిన్నందుకు వాటి యజమాని జనార్దన్‌కు పంచాయతీ అధికారి రూ. 5000లు జరిమానా విధించారు.
సంగంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చెట్లను తొలగించిన బక్కయ్య, రాజయ్య, మీనయ్యలకు రూ. 2000లు చొప్పున జరిమానా విధించగా.. మరో వ్యక్తి తిరుపతికి రూ. 1500 జరిమానా విధించారు. నాటిన మొక్కలు తొలగిస్తే జరిమనాతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. మొక్కలను సంరక్షించుకోవడం అందరి బాధ్యత అని తొలగిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
ఇదీ చూడండి: పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?