జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పోతారంలో ఇంట్లో ఉండకుండా బయట తిరిగిన వ్యక్తికి గ్రామ పంచాయతీ సిబ్బంది రూ. 2 వేల జరిమానా విధించారు. మ్యాన నారాయణ రెండు రోజులుగా రోడ్లపై తిరుగుతున్నాడు.
గ్రామ పంచాయతీ సిబ్బంది ఎంత చెప్పినా వినిపించుకోలేదు. విసిగిపోయి రెండు వేల రూపాయలు జరిమానా విధించారు. ఎవరూ బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలంటూ పంచాయతీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చూడండి : బియ్యం, నగదు త్వరలోనే పంపిణి చేస్తాం: సీఎస్