ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై జనవరి 18 నుంచి ఫిబ్రవరి 17 వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రవి పేర్కొన్నారు. కోరుట్ల రవాణా శాఖ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని కలెక్టర్ రవి పేర్కొన్నారు. ప్రమాదాల్లో మృతుల్లో ఎక్కువ మంది యువత ఉండడం దురదృష్టకరమన్నారు. అవగాహన లేకపోవడం వల్లే రోజురోజుకు ప్రమాదాలు పెరిగిపోతున్నాయన్నారు. నిబంధనలు పాటించకపోతే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలో రక్తదాన కార్యక్రమాలు విరివిగా ఏర్పాటు చేసి ఎక్కువ మొత్తంలో రక్తాన్ని నిల్వచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 8తేదీ నుంచి జిల్లాలో నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు రవాణాశాఖ అధికారి పేర్కొన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: వరిపొలంలోకి దూసుకెళ్లిన ఆటో.. 18 మందికి తీవ్రగాయాలు