ETV Bharat / state

'భక్తి ముసుగులో ఒకరు.. అభివృద్ధి ముసుగులో మరొకరు దోపిడీ' - Revanth Reddy Padayatra

Revanth Reddy visit to Kondagattu: భక్తి ముసుగులో ఒక పార్టీ, అభివృద్ధి ముసుగులో మరో పార్టీ దోపిడీ చేసున్నాయని రేవంత్ ​రెడ్డి మండిపడ్డారు. కొండగట్టు అంజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని భక్తులను, పూజారులనే కాదు అంజన్ననే కేసీఆర్ కుటుంబం మోసం చేస్తుందని విమర్శించారు.

Revanth Reddy
Revanth Reddy
author img

By

Published : Mar 6, 2023, 2:33 PM IST

Revanth Reddy visit to Kondagattu: జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు. సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయానికి తక్షణమే రూ.500 కోట్ల విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. కేసీఆర్ కుటుంబం భక్తి ముసుగులో ఒకరు, అభివృద్ధి ముసుగులో మరొకరు దోచుకుంటున్నారని రేవంత్​రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలోనే ప్రశస్తమైన దేవాలయం కొండగట్టు అని.. అంజన్న ఆశీర్వాదం తీసుకొని రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలకు మేలు కలగాలని కోరుకోవడం జరిగిందన్నారు.

ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని గుడిలో ఉన్న పూజారులను, భక్తులను మాత్రమే కాకుండా కొండగట్టు అంజన్నను అబద్ధాల వాగ్ధానాలతో మోసం చేసిన ఘనత సీఎం కేసీఆర్​దని రేవంత్​ ధ్వజమెత్తారు. కవిత హనుమాన్ చాలీసా పారాయణం చేసి.. 125 అడుగుల హనుమంతుడి విగ్రహం కట్టిస్తానని మోసం చేశారన్నారు. తండ్రి, కుమారుడు, కూతురు దేవుళ్లను కూడా మోసం చేశారని.. 600 సంవత్సరాల చరిత్ర కలిగిన కొండగట్టు ఆలయాన్ని భక్తులకు ఇబ్బంది కలగకుండా అభివృద్ధి చేయాలన్నారు.

ఆలయం చుట్టూ ఉన్న 800 ఎకరాల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి కాపాడాలని డిమాండ్​ చేశారు. గతంలో కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగి 70 మంది చనిపోయారని.. బస్సు బాధిత కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయలేదన్నారు. తూతూ మంత్రంగా ఆర్ధిక సాయం చేశారని.. ప్రమాదం జరిగిన చోట ఒక గోడ మాత్రం కట్టి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేస్తాడనే నమ్మకం లేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండగట్టును అభివృద్ధి చేస్తామని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ఆయనతో పాటుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ నాయకుడు మేడిపల్లి సత్యం స్వామి వారిని దర్శించుకున్నారు.

"తెలంగాణలోనే ప్రశస్తమైన దేవాలయం కొండగట్టు. అంజన్న ఆశీర్వాదం తీసుకొని రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలకు మేలు కలగాలని కోరుకోవడం జరిగింది. ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని గుడిలో ఉన్న పూజారులను, భక్తులను మాత్రమే కాకుండా కొండగట్టు అంజన్నను అబద్ధాల వాగ్ధానాలతో మోసం చేసిన ఘనత సీఎం కేసీఆర్​ది. కవిత హనుమాన్ చాలీసా పారాయణం చేసి.. 125 అడుగుల హనుమంతుని విగ్రహం కట్టిస్తానని మోసం చేశారు. గతంలో కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగి 70 మంది చనిపోయారు. బాధిత కుటుంబాలకు తూతూ మంత్రంగా ఆర్ధిక సాయం చేశారు. ప్రమాదం జరిగిన చోట ఒక గోడ మాత్రం కట్టి ఎలాంటి చర్యలు తీసుకోలేదు". -రేవంత్ రెడ్డి

రేవంత్​రెడ్డి కొండగట్టులో పర్యటన

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.