జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలో లాక్డౌన్ విధిస్తూ పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. ఇటీవల గ్రామంలో 27 మందికి కరోనా పాజిటివ్ రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామంలోని హోటళ్లు, కటింగ్ షాపులతో పాటు మిగతా దుకాణాలు ఈనెల 15 వరకు మూసివేయాలని.. కిరాణా దుకాణాలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచాలని నిర్ణయించారు.
షాపులకు వచ్చే వారికి మాస్కులు ఉంటేనే వస్తువులు ఇవ్వాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంగిస్తే రూ.1,000 జరిమానా విధించనున్నట్లు తెలిపారు. గ్రామంలో అన్ని వీధిలో పరిశుభ్రంగా ఉంచుతూ హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేస్తూ కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు.
ఇదీ చూడండి: ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ ఉచిత ఆర్టీపీసీఆర్ పరీక్షలు