జగిత్యాల జిల్లా స్తంభంపల్లిలో రేణుక ఎల్లమ్మ కొలుపు ఘనంగా నిర్వహించారు. ఐదేళ్లకోసారి జరిగే పండుగకు గీతకార్మికులు పెద్దఎత్తున హాజరయ్యారు. వేడుకలో భాగంగా ఒకే తాటిచెట్టు కల్లును 15మంది గీతకార్మికులు కిందకు దింపారు.
అమ్మవారికి సమర్పించే కల్లు కుండ.. మోకు, ముస్తాదుకు అంటకుండా చేతుల మీదుగా దించడం ఆనవాయితీగా వస్తోంది. కల్లు దించుతుండగా.. ఈలలు, కేరింతలతో గీతకార్మికుల కుటుంబసభ్యులు సందడిచేసి ఆనందాన్ని పంచుకున్నారు.
- ఇదీ చదవండి : ఆత్మహత్యలకు చిరునామాగా మారుతున్న రైల్వేట్రాక్‌లు