కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు కార్పొరేటు సంస్థలకు లాభం చేకూర్చేవిగా ఉన్నాయని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత విమర్శించారు. రైతును రాజు చేయడమే తెరాస ప్రభుత్వ లక్ష్యమన్నారు. రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ.. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ స్థాయిలో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు.
వివిధ గ్రామాల నుంచి వచ్చిన ట్రాక్టర్లతో 63వ నెంబర్ జాతీయరహదారి గులాబీమయం అయ్యింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందన్నారు.