జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలో అనారోగ్యంతో మృతి చెందిన రైతులు చెప్యాల దుర్గయ్య, రాయనవేణి నర్సయ్యల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అందజేశారు. రైతులది సహజ మరణమే అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా చెల్లిస్తుందని ఆయన తెలిపారు.
రైతు కుటుంబాల్లో ఆనందం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవిత బీమా సంస్థకు రూ.3 వేల కోట్ల ప్రీమియం చెల్లిస్తుందన్నారు. రైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకే సీఎం అనేక చర్యలు చేపడుతున్నారన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్ కేసులు