జగిత్యాల జిల్లాలో ర్యాపిడ్ టెస్టు కిట్ల కొరత ఏర్పడింది. దీని కారణంగా కరోనా నిర్ధరణ పరీక్షలు చేయకపోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు. కిట్లు అందకపోవటంతో రాయికల్ మండల కేంద్రంలో వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు నిత్యం 10 వేల కిట్లు అవసర ఉండగా... కేవలం 1,600 కిట్లు మాత్రమే సరఫరా చేస్తున్నారని అన్నారు.

దీంతో రోజు 2 నుంచి 3 వందల కిట్లు అవసరం ఉన్న కేంద్రానికి... కేవలం 50 కిట్లు మాత్రమే అందజేస్తున్నారని తెలిపారు. దాని వల్ల 50 మందికి నిర్ధరణ పరీక్షలు చేసి మిగతా వారిని తిరిగి పంపుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. టెస్టుల కోసం వచ్చిన చాలామంది బాధితులకు వెనుతిరుగాల్సి వస్తోందని... ప్రభుత్వం కిట్లు అందజేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: రేపు తెజస ఆవిర్భావ దినోత్సవం.. కొవిడ్ నిబంధనలతో వేడుకలు