Problems in Kondagattu Temple: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి జగిత్యాలలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం. ఇక్కడికి రాష్ట్ర నలుమూలల నుంచి శని, మంగళవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటారు. అయినప్పటికీ ఇక్కడ భక్తులకు సమస్యలు వెంటాడుతున్నాయి. తాగునీరు అందుబాటులో ఉండటం లేదు. సేద తీరడానికి కనీసం షెడ్లు కూడా లేకపోవడంతో భక్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. స్వామి వారి సన్నిధిలో బస చేయాలన్న గదులు సరిపోవడం లేదు. పారిశుద్ధ్య నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఇక్కడికి వచ్చే భక్తులు కనీస సౌకర్యాలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
స్వామి వారి ఆలయానికి ఏటా రూ.20 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. అయినప్పటికీ అభివృద్ధి మాత్రం అంతగా జరగడం లేదు. ప్రభుత్వం సైతం నిధులు కేటాయించకపోవంతో ఆలయ పురోగతి ముందుకు సాగడం లేదు. కొండపైకి చేరేందుకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు పనులు చేపట్టలేదు. కొండగట్టు అంజన్న ఆలయానికి ప్రభుత్వం నిధులు కేటాయించి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: