కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు ప్రజలకు అబద్దాలు చెప్తున్నారని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని రాష్ట్ర ఇరిగేషన్ ఛైర్మన్ ఈద శంకర్ రెడ్డి జగిత్యాల జిల్లా సమావేశంలో అన్నారు. ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్మాణానికి 14 ఏళ్లు పట్టిందని... కాళేశ్వరం ప్రాజెక్టును అతి తక్కువ కాలంలో పూర్తి చేసి రైతులకు నీరందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవమని.. చర్చకు సిద్ధమని శంకర్ రెడ్డి సవాల్ విసిరారు.
ఇదీ చూడండి:తండాలు గ్రామాలైనా... తప్పని తిప్పలు