జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరుల దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మ, అదనపు ఎస్పీ సురేశ్ ఈవేడుకల్లో పాల్గొని విధినిర్వహణలో ప్రాణాలర్పించిన రక్షరభటులకు నివాళులర్పించారు.
వారిసేవలను గుర్తు చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారని, పోలీసుల సేవలు మరువరానివని కలెక్టర్ కొనియాడారు.
ఇదీ చూడండి: పోలీసులకు, జవాన్లకు సమాజం ఎంతో రుణపడి ఉంది: హోంమంత్రి