రెండు లారీల్లో వస్తున్న 50 మంది రాజస్థాన్ వాసులను జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. లాక్‌డౌన్ పాటించేట్లదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా విజయవాడ నుంచి వస్తున్నట్టు తెలుస్తోంది.
తమను అడ్డుకున్నారనే కోపంతో రాజస్థాన్ వాసులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులకు, రాజస్థాన్ వాసులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం వారిని అక్కడినుంచి పంపించారు.
ఇవీ చూడండి: ఆకలితో ఎవరూ ఉండకూడదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్