ETV Bharat / state

లోతట్టు ప్రాంతాలు జలమయం.. అవస్థల్లో జనం - జిల్లాలో భారీ వర్షం... ఇబ్బందుల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జగిత్యాల జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీల్లోంచి నీరు బయటకు రాగా.. కలెక్టర్​ రవి అధికారులతో టెలికాన్ఫరెన్స్​ నిర్వహించి లోతట్టు ప్రాంతాల్లో ప్రజల విషయంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు సూచించారు.

people afraid of heavy rains in jagityal district
జిల్లాలో భారీ వర్షం... ఇబ్బందుల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు
author img

By

Published : Aug 16, 2020, 6:35 PM IST

జగిత్యాల జిల్లాలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్​ ప్రాంతంలో రోడ్లన్నీ వర్షం వల్ల జలమయమయ్యాయి. ఆ వైపు వెళ్లాల్సిన వాహనదారుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

జిల్లాలోని సార్గమ్మ వీధి, పోచమ్మవాడ ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లతున్నాయి. జిల్లాలో 158.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా కలెక్టర్​ రవి శనివారం టెలికాన్ఫరెన్స్​ నిర్వహించి.. అధికారులకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాల జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు.

ఇదీచూడండి: ఇవాళ, రేపు భారీ వర్షాలు..19న మరో అల్పపీడనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.