జగిత్యాలలో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న బాలకార్మికులను అధికారులు గుర్తించి వారికి విముక్తి కల్పించారు. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా ఈ సోదాలు నిర్వహించారు. పట్టణంలో 15 మందిని గుర్తించిన అధికారులు వారిని కరీంనగర్లోని చైల్డ్హోమ్కు తరలించారు. బడిమానేసిన పిల్లను బడికి పంపేలా, కార్మికులుగా పని చేసే వారిని గుర్తించి వారికి విముక్తి కల్పిస్తామని అధికారులు వెల్లడించారు. 14 ఏళ్లలోపు గల బాలబాలికలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవీచూడండి: పద్దు 2019: రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం!