ETV Bharat / state

కరోనా సోకింది.. ఆస్పత్రి వాళ్లు వద్దన్నారు! ఇంటి యజమాని రావొద్దన్నాడు!! - మెట్పల్లిలో కరోనా రోగి బాధలు

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని దుబ్బవాడలో ఓ వ్యక్తికి కరోనా రాగా.. అతన్ని ఆసుపత్రిలో చేర్చుకోకపోగా ఇంటికి వెళ్లారు. అక్కడ అద్దెకు ఉంటున్న ఇతన్ని యజమాని అనుమతించకపోవడంతో రోగి పరిస్థితి రోడ్డుపాలైంది. తర్వాత అతన్ని మెట్​పల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడ ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డులో అతన్ని ఉంచారు.

not accomodation for corona patient at metpalli
కరోనా సోకింది.. ఆస్పత్రి వాళ్లు వద్దన్నారు! ఇంటి యజమాని అనుమతించలేదు!!
author img

By

Published : Jul 29, 2020, 6:06 PM IST

ఇటీవల కాలంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తున్నందున.. ప్రజలు కొవిడ్ వస్తే అనే ఆలోచన కన్నా.. అది సోకిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయోనని ఊహిస్తూ భయపడుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని దుబ్బవాడలో ఓ వ్యక్తికి మంగళవారం కరోనా పాజిటివ్ రాగా వైద్యులు అతన్ని వెంటనే జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వ్యాధి సోకినా లక్షణాలు లేవటూ.. అక్కడి వైద్యులు రోగిని ఇంటికి పంపించారు. ఆ వ్యక్తి అద్దెకు ఉంటున్న ఇంట్లో 12 కుటుంబాలు ఉంటాయని.. అతని వల్ల ఎవరూ వ్యాధి బారిన పడకూడదని.. ఇంటి యజమానికి అతన్ని లోనికి అనుమతించలేదు. ఈ మేరకు ఆ కరోనా సోకిన వ్యక్తి గంటన్నరపాటు రోడ్డుమీద ఉండగా.. చుట్టుపక్కల ప్రజలు అతన్ని వింతగా చూశారు.

రోగిని మరోచోట ఉంచేందుకు పురపాలక అధికారులు గదుల కోసం వెతుకుతూ ఉండగా.. అతన్ని అంబులెన్స్​లో మెట్​పల్లి ప్రభుత్వాసుుత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ కూడా రోగిని లోనికి అనుమతించలేదు. అక్కడ మరో అరగంట సేపు వేచి ఉండగా.. ఎట్టకేలకు అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కొవిడ్ వార్డులో వ్యక్తిని ఉంచేందుకు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్ణయించారు.

ఇవీ చూడండి: గేటెడ్‌ కమ్యూనిటీల్లో కరోనా చికిత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.