మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులకు డబ్బులు పెట్టామని మాట్లాడుతున్న అధికార మంత్రులు, ఎమ్మెల్యేలు మున్సిపాలిటీలను ఏ విధంగా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. మాజీ ఎంపీ కవిత, మంత్రి హరీష్ రావును పక్కన పెట్టి... మంత్రి కేటీఆర్ ఒక్కడే రాష్టాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. పౌరసత్వ చట్టానికి తెరాస మద్దతు ఇవ్వక పోయినా... రాష్ట్రంలో ఈ బిల్లు అమలౌతుందన్నారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందన్నారు. ఎన్నికల కోడ్ వల్ల ఆ ప్రకటన రాలేదన్నారు.
రాయికల్ నూతన మున్సిపాలిటీ ఎన్నికల్లో నిలబడ్డ భాజపా 12 మంది అభ్యర్థులను గెలిపిస్తే... కేంద్రం నుంచి మరిన్ని డబ్బులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా... అర్వింద్‌ను రైతులు ఘనంగా సన్మానించారు.
ఇవీ చూడండి: 'తెరాస మోసాలే... పుర ఎన్నికల్లో మన అస్త్రాలు'