జగిత్యాల జిల్లాలో మరో కరోనా కేసు నమోదైంది. ఈ మధ్యనే ముంబయి నుంచి వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. కరోనా సోకిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు జిల్లా వైద్యాధికారి పుష్పాల శ్రీధర్ తెలిపారు.
జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం ఆరు పాజిటివ్ కేసులు నమోదవ్వగా... వారిలో ముగ్గురు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇవాళ నమోదైన కేసుతో కలుపుకుని ముగ్గురు చికిత్స పొందుతున్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరినీ హోంక్వారంటైన్లో ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: పిల్లుల్లోనూ కరోనా వ్యాప్తి.. వాటి నుంచి మనుషులకు?