కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. జగిత్యాలలో ముస్లింలు భారీ ఆందోళన నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఖిలా సమీపంలోని జమా మసీదు వద్ద ఆందోళనకు దిగారు. ముస్లింలకు మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి సంఘీభావం పలికారు. సెక్యూలర్ దేశంగా ఉన్న భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా భాజపా సర్కారు నిర్ణయాలు తీసుకుంటోందని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్‌ఆర్సీ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:తాగుడికి బానిసై... భార్యను కడతేర్చిన భర్త