జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలువురు దుకాణాదారులకు మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా 50 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లను అమ్ముతున్నట్టు తెలుసుకున్న జగిత్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, ఏఈ వెంకటేశ్, మున్సిపల్ సిబ్బంది దుకాణాల్లో సోదాలు చేశారు. పలువురు దుకాణాదారులు 50 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్నట్టు గుర్తించిన మున్సిపల్ అధికారులు దుకాణాదారులకు జరిమానా విధించారు. మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే.. దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
జగిత్యాల దుకాణాల్లో.. మున్సిపల్ అధికారుల సోదాలు! - మున్సిపల్ అధికారులు
పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని నిత్యం ప్రచారం చేసినా కొందరి తీరులో మార్పు రావడం లేదు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలువురు దుకాణాదారులు నిబంధనలు ఉల్లంఘించి ప్లాస్టిక్ కవర్లను అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది దుకాణాదారులకు జరిమానా విధించారు.