జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పురపాలక ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. పట్టణంలోని 26 వార్డుల్లో పోలింగ్ కోసం 60 కేంద్రాలను గుర్తించారు.
పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా ఏర్పాట్లు చేయాలని మెట్పల్లి పురపాలక కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
- ఇదీ చూడండి : 'పుర'పోరుకు పోలింగ్ కేంద్రాల షెడ్యూల్ ప్రకటన