ETV Bharat / state

MP Arvind Comments: 'రానున్న ఎన్నికల్లో భాజపా విజయం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి' - MP Arvind comments on bjp winning

MP Arvind Comments: జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ఏర్పాటు చేసిన భాజపా శిక్షణ ముగింపు శిబిరంలో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ పాల్గొన్నారు. కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన అర్వింద్​ పలు సూచనలు చేశారు. రానున్న ఎన్నికల్లో భాజపా విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు.

MP Arvind comments on cm kcr in metpally bjp meeting

author img

By

Published : Dec 12, 2021, 9:24 PM IST

'రానున్న ఎన్నికల్లో భాజపా విజయం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి

MP Arvind Comments: దేశంలో బాధ్యతారహితమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ సీఎం కేసీఆరేనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ఏర్పాటు చేసిన భాజపా శిక్షణ ముగింపు శిబిరంలో అర్వింద్​ పాల్గొన్నారు. కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన అర్వింద్​ పలు సూచనలు చేశారు. రానున్న ఎన్నికల్లో భాజపా విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు.

రాష్ట్ర సర్కారుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ అర్వింద్.. రైతులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎనిమిదేళ్లుగా ధాన్యం కొనుగోలు చేస్తోంది తానేనని.. కేసీఆర్ గొప్పలు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. నూనె పంటలు వేయాలని చెబుతున్న సీఎం.. పంట వేయడానికి విత్తనాలే సిద్దం చేయలేదన్నారు. యాసంగిలో వరి వేసిన రైతులను కాపాడాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్​దేనని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోదీ చెరుకు రేటు పెంచితే కేసీఆర్ మాత్రం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పట్టించుకున్న పాపానపోలేదని దుయ్యబట్టారు. షుగర్​ ఫ్యాకరీని ఎందుకు పునరుద్దరించడం లేదని ప్రశ్నించారు. సీఎంకి ఫ్యాక్టరీ నడిపించడం చేతకాకపోతే ఎవరికన్న అప్పజెప్పాలన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.