తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలకు రవాణా ఇబ్బంది రాకుండా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు వాహనాలను నడుపుతున్నట్లు జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషన్‌రావు తెలిపారు. ప్రైవేటు వాహనాలతో పాటు పలు పాఠశాలల వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకుని గమ్యస్థానాలకు చేర్చారు. 263 ఆర్టీసీ బస్సులకు ప్రత్యామ్నాయంగా 70 ప్రైవేటు వాహనాలు, 129 పాఠశాల బస్సులను నడుపుతున్నట్లు ఎంవీఐ తెలిపారు.
ఇదీ చదవండిః అన్ని మార్గాల్లో బస్సులు నడుపుతాం: జిల్లా కలెక్టర్