జగిత్యాల, కోరుట్లలో మోడల్ పోలింగ్ కేంద్రాల ప్రారంభం సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ది ప్రత్యేక స్థానం. 185 మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో నిలవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నిక బ్యాలెట్లో నిర్వహించాలని రైతు అభ్యర్థులు కోరినా.. ఎన్నికల కమిషన్ ఈవీఎంల వైపే మొగ్గు చూపింది. అందుకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేసింది. ఈవీఎంల చరిత్రలో తొలిసారిగా 12 యంత్రాలను నిక్షిప్తం చేశారు. జగిత్యాల, కోరుట్లలో దీనికి సంబంధించిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఎలక్షన్ కమిషన్ ఉన్నతాధికారులు ఇవాళ ప్రారంభించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలనాధికారి సుదీప్ జైన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ జగిత్యాల, కోరుట్లలో ఈ మోడల్ పోలింగ్ కేంద్రాలను ప్రారంభించారు.
సాంకేతిక సమస్యలు తలెత్తకుండా...
తొలిసారి 12ఈవీఎంలను ఇక్కడ నిక్షిప్తం చేశారు. ఈవీఎం యంత్రాల్లో 185 మంది అభ్యర్థుల ఫొటోలు ఉంటాయి. ఎలాంటి సాంకేతిక సమస్యలు వచ్చినా పరిష్కరించేందుకు 600మంది ఇంజినీర్లను ఇందుకోసం నియమించారు. వీరంతా హైదరాబాద్, బెంగళూరు నుంచి ఇప్పటికే నిజామాబాద్, జగిత్యాల చేరుకున్నారు. ఇవాళ్టి నుంచి ఈ ఓటింగ్ నమూనా కేంద్రంలో ఓటర్లకు ఈవీఎంలపై అవగాహన కల్పించనున్నారు.
ఇవీ చూడండి:నిజామాబాద్లో వార్ వన్ సైడే: కవిత