ETV Bharat / state

MLC Kavitha Fires on Rahul Gandhi : 'రాహుల్​ గాంధీ అప్​డేటెడ్​ లేని.. అవుట్​ డేటెడ్​ నాయకుడు'

MLC Kavitha Fires on Rahul Gandhi : ఊహకందని విధంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి... బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రాహుల్​ గాంధీ అప్​డేటెడ్​ లేని అవుట్​ డేటెడ్​ నాయకుడు అయిపోయారని జగిత్యాలలో నిర్వహించిన బీఆర్​ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆరోపించారు. ఈ సందర్భంగా కవిత బీజేపీ, కాంగ్రెస్​లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Kavitha Paricipated BRS Meeting in Jagityal
MLC Kavitha Fires on Rahul Gandhi
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2023, 6:55 PM IST

MLC Kavitha Fires on Rahul Gandhi : రాహుల్​ గాంధీ అప్​డేటెడ్​ లేని అవుట్​ డేటెడ్​ నాయకుడు అయిపోయారని బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) ఆరోపణ చేశారు. ఊహకందని విధంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన గెలిచేది బీఆర్​ఎస్​ ప్రభుత్వమే(BRS).. అభివృద్ధి చేసేది కూడా తమ ప్రభుత్వమేనని తెలిపారు. జగిత్యాల జిల్లాలో జరిగిన బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనం(BRS MEETING)లో ముఖ్య అతిథిగా కవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వంటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత బీజేపీ, కాంగ్రెస్​లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి ఇదే చివరి అవకాశం అంటారని.. మరి అతనిని నమ్ముదామా అంటూ బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. నాయకులంటే ఇలాగే ఉంటారా అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ పార్టీ మోసం చేసే పార్టీనని దుయ్యబట్టారు. అందుకే ఒకప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీ.. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకే పరిమితం అయిందని విరుచుకుపడ్డారు.

BRS Congress Debate on SC ST Declaration : ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్​పై రగడ.. ఆగని అధికార, విపక్షాల గలాట

"కాంగ్రెస్​ వాళ్లు రూ.4000 ఫించన్​ ఇస్తారంటూ.. నమ్ముతామా వారి మాటలు. ఇక రేపు 17వ తేదీన గాంధీ పరివారం అంతా హైదరాబాద్​లో దిగుతుందట. దేశవ్యాప్త సమావేశాలు మొత్తం హైదరాబాద్​లోనే పెడుతున్నారంట. నిజంగా గమ్మత్తుగా ఉంటుంది కాంగ్రెస్​ పార్టీ. ఎందుకో తెలుసా నిన్నకాక మొన్న రాహుల్​ గాంధీ మాట్లాడుతున్నారు. మొన్ననే ఖర్గే వచ్చి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​ ఇచ్చి వెళ్లారు. ఏమంటున్నారు మేము వచ్చి పోడు పట్టాలు ఇస్తామని చెబుతున్నారు. మరి అప్​డేట్​ కారా.. మొన్ననే బీఆర్​ఎస్​ పోడు పట్టాలను పూర్తిగా పంచేసింది. రాహుల్​ గాంధీ అప్​డేటెడ్​ లేని అవుట్​ డేటెడ్​ నాయకుడు అయిపోయాడు. ఆయన మోదీని ఆపలేకపోతున్నారు అందుకే కేసీఆర్​ అడ్డుకోవాలనుకుంటున్నారు. కేసీఆర్​ స్పీడ్​ను అడ్డుకోవడం రాహుల్​ గాంధీ తరం కాదు. అందుకే కేంద్రంలో కాంగ్రెస్​కు ప్రత్యామ్నాయం బీఆర్​ఎస్​ అయింది." - కవిత, బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ

BRS Meeting in Jagitya : ఇది కార్యకర్తల సభలా కాదు మహాసభలా కనిపిస్తోందని.. వేరే పార్టీల సభలన్నీ వెలవెల పోతున్నాయని చెప్పారు. ఇందుకు స్ఫూర్తిని ఇచ్చింది సీఎం కేసీఆర్​.. ఆయన సీఎం ఉన్నందువల్లే నీళ్లు, నిధులు, నియామకాల్లో నంబర్​ వన్​గా ఉన్నామని తెలిపారు. వాస్తవానికి దేశంలో ఎక్కడ కూడా ప్రత్యేక ఉద్యమాలు సక్సెస్​ కాలేదు.. కానీ ఒక్క తెలంగాణలోనే ఉద్యమాలు చేపట్టి విజయం సాధించింది కేసీఆర్​నే అని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాదినే పోడు పట్టాలు ఇస్తే.. రాహుల్​ గాంధీ అప్​డేటేడ్​ లేని అవుట్​ డేటేడ్​ నేతగా.. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే పోడు పట్టాలిస్తానని చెప్పడం ఏంటని దుయ్యబట్టారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని.. అభివృద్ధి చేసేది తమ ప్రభుత్వమేనని కవిత తెలిపారు.

MLC Kavitha Fires on Rahul Gandhi రాహుల్​ గాంధీ అప్​డేటెడ్​ లేని.. అవుట్​ డేటెడ్​ నాయకుడు

KTR Tweet on BRS Candidates List : టికెట్​ దక్కని అభ్యర్థులకు మరోరూపంలో అవకాశం ఇస్తామన్న కేటీఆర్.. మైనంపల్లి వ్యాఖ్యలపై సీరియస్

BRS MLAs Final Candidates List 2023 : బీఆర్​ఎస్​ గెలుపు గుర్రాలివే.. తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.