జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో అంజన్న సేవా సమితి ఆధ్వర్యంలో చాలీసా అఖండ పారాయణం ఆరంభమైంది. తొలి రోజు ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులు, అర్చకులు, అంజన్న సేవా సమితి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకాగా.. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి.
అంతకు ముందు ఎమ్మెల్సీ కవిత కొండగట్టు అంజన్న వై జంక్షన్ నుంచి రామకోటి ప్రతులను ఎత్తుకుని పాదయాత్రగా ఆలయం వరకు చేరుకున్నారు. స్వామివారికి రామకోటి ప్రతులను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వేదికపై హనుమాన్ చాలీసాను పఠించారు. రెండు మండలాలు(80 రోజుల) ఈ హనుమాన్ చాలీసా అఖండ పారాయణం సాగుతుందని.. భక్తులు ప్రతిరోజు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కవిత కోరారు.
ప్రతి ఇంటా హనుమాన్ చాలీసా జరగాలని సంకల్పంతో ఈ కార్యక్రమానికి పూనుకునుకున్నట్లు కవిత తెలిపారు. ఈ 80 రోజుల్లో 11 కోట్ల రామకోఠి ప్రతులను సమర్పిస్తారని... వచ్చే చిన్నహనుమాన్, పెద్ద హనుమాన్ జయంతికి అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు.