తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జలదీక్షలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పార్టీ ముఖ్య నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేయడమేకాక.. ప్రాజెక్టుల వద్దకు చేరకుండా అరెస్టు చేస్తున్నారు.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని.. జగిత్యాల జిల్లాలో గృహనిర్బంధం చేశారు. కారులో వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా గేట్లుమూసి పోలీసులు భారీగా మోహరించారు.
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు..
కేవలం ప్రాజెక్టు సందర్శించేందుకు వెళ్తున్నా.. తమను అడ్డుకోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని జీవన్ రెడ్డి విమర్శించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. లక్షల కోట్ల అప్పులు చేసి.. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు.. అరెస్టులతో నిజాన్ని దాచలేరని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 3 లక్షలు దాటిన కేసులు- 24 గంటల్లో 11,458 మందికి కరోనా