ETV Bharat / state

ధరణి పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు : ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి - జగిత్యాల తాజా సమాచారం

ధరణి పోర్టల్​ పేరుతో ప్రభుత్వం కొత్త దోపిడీకి తెరతీసిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి విమర్శించారు. ధరణిలో లావాదేవీలు, విధివిధానాలపై స్పష్టత లేదన్నారు. పోర్టల్​లో లోపాలు ప్రజలకు శాపంగా మారాయని ఆరోపించారు.

MLC Jeevan reddy demands govt to clarify dharani portal full details to people
ధరణి పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు : ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి
author img

By

Published : Nov 15, 2020, 5:48 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ లోపాలు ప్రజల పాలిట శాపంగా మారాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆరోపించారు. వారసత్వ ఆస్తికి సంబంధించి మళ్లీ రిజిస్ట్రేషన్​ చేయడం హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. ఎకరాకు రూ.2500 వసూలు చేస్తూ కొత్తదోపిడీకి తెర తీశారని జగిత్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు.

కుటుంబాలు లేనివారు ఏదైనా ట్రస్ట్​కు ఇవ్వాలంటే అవకాశం లేదని, రైతులకు పట్టదారు పాసుపుస్తకాలు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ధరణి పోర్టల్, ఎల్​ఆర్ఎస్​పై ప్రజలకు స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. సీఎం ఒంటెద్దు పోకడలతో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా ధరణికి సంబంధించిన విధివిధానాలపై వివరాలను వెల్లడించాలని జీవన్​రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'ధరణి ప్రాజెక్టును ఆ కంపెనీకి ఎలా కట్టబెడతారు..?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.