ETV Bharat / state

MLC Jeevan reddy comments on cm kcr : కమీషన్ల కోసమే కాళేశ్వరం: జీవన్ రెడ్డి - తెలంగాణ వార్తలు

MLC Jeevan reddy comments on cm kcr : సీఎం కేసీఆర్​పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రూ.2 వేల కోట్లతో తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించే అవకాశం ఉన్నా... దిగువన ఉన్న కాళేశ్వరం వద్ద నిర్మించారని... ఫలితంగా రూ.లక్షా 20 వేల కోట్ల అప్పుల భారం పడిందని ఆరోపించారు. దీనిపై మేధావులు, సాంకేతిక నిపుణులు ఆలోచించాలని జగిత్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు.

MLC Jeevan reddy comments on cm kcr, jeevan reddy press meet
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్​మీట్
author img

By

Published : Jan 11, 2022, 3:45 PM IST

MLC Jeevan reddy comments on cm kcr : సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయంతో తెలంగాణను పణంగా పెట్టారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి ఉంటే... ఇదివరకే తవ్వి ఉన్న కాలువలు ఉపయోగించుకునే అవకాశం ఉండేదన్నారు. అంతేగాకుండా మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌ ప్రాంతాల్లోని 2 లక్షల ఎకరాలకు నీరు అందే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. కమీషన్ల కోసం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం తప్పుడు నిర్ణయమన్న జీవన్ రెడ్డి.. వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని దుయ్యబట్టారు.

తుమ్మడిహట్టి వద్ద నీటిని మళ్లింపు చేసుకునే విధంగా 148 మీటర్ల ఎత్తుతో... ప్రాజెక్ట్ నిర్మించుకుని నీటి మళ్లింపు చేసుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇంటర్​స్టేట్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. దిగువన మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించినా.. దిగువన ఎత్తిపోతల ద్వారా తరలింపు చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాపై రూ.1.20వేల కోట్ల అప్పులతో కాళేశ్వరం ప్రాజెక్టు తలపెట్టింది. అనుమతులు ఉన్నా కూడా తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించుకోలేకపోయాం. మన హక్కులను మనం వినియోగించుకోలేకపోయాం.

-ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్​మీట్

ఇదీ చదవండి: father murdered two children: ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి చంపిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.