దిశ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకురావాలని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో కలిసి కోరుట్లలో స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు భారీ ర్యాలీ నిర్వహించారు. నంది విగ్రహం నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. ర్యాలీలో సుమారు పది వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
దిశ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చట్టాల్లో మార్పు రావాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఏది కోరుకుంటే పోలీసులు అదే చేస్తున్నారని.. పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దని ఎమ్మెల్యే సూచించారు. రాష్ట్రంలో మహిళలపై ఇన్ని ఘటనలు జరుగుతున్నా.. ప్రతిపక్ష నాయకులు ఎక్కడ ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి: అవగాహన లేక 'పౌర' చట్టంపై విపక్షాల నిరసనలు